పనిమనిషికి గవర్నమెంట్ జాబ్.. సెలబ్రేట్ చేసుకున్న డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ(పోస్ట్)

by Kavitha |
పనిమనిషికి గవర్నమెంట్ జాబ్.. సెలబ్రేట్ చేసుకున్న డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ(పోస్ట్)
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక ‘పుష్ప’ మూవీతో ఏకంగా పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప సినిమాకి సీక్వేల్‌గా వస్తున్న ‘పుష్ప2’ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ల బిజీలో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. 'పుష్ప2' రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులు సమయం ఉండగానే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన హ్యాపీ మూమెంట్‌ను సుకుమార్ భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమ దగ్గర పనిమనిషిగా చేసే అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని గుడ్ న్యూస్ షేర్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇక ఆ హ్యాపీ మూమెంట్‌కు సంబంధించిన ఫొటో షేర్ చేస్తూ.. ' సినిమా హంగామాలోనూ మేమంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఎందుకంటే మా ఇం‍ట్లో పనిచేస్తూ చదువు పూర్తి చేసిన దివ్య.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఈ సందర్భంగా మేం ఆమెని మనస్ఫూర్తిగా అభినందించాం. దివ్య.. మేం నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం..' అంటూ సుకుమార్ భార్య రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుకుమార్ పనిమనిషికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సదరు పని మనిషికి గవర్నమెంట్ జాబ్ రావడానికి కారణం సుకుమారే అని సమాచారం.

Advertisement

Next Story