రష్యా పైకి అత్యాధునిక 'స్టార్మ్ షాడో' మిస్సైల్స్! ఆందోళనలో పుతిన్.?

by Geesa Chandu |   ( Updated:2024-09-13 20:12:43.0  )
రష్యా పైకి అత్యాధునిక స్టార్మ్ షాడో మిస్సైల్స్! ఆందోళనలో పుతిన్.?
X

దిశ, వెబ్ డెస్క్: ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక ముగింపు అనేది రాలేదు. పైగా రెండు దేశాల మధ్య సమస్య ఇంకా తీవ్రమవుతోంది. ప్రస్తుతానికి రష్యా, ఉక్రెయిన్ పై మిస్సైల్స్(Missiles) తో విరుచుకుపడుతుండగా.. ఉక్రెయిన్ డ్రోన్లతో(Drones) దాడులు చేస్తోంది. ఈ సమయంలోనే జెలెన్ స్కీ ప్రభుత్వం పోరాటాన్ని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో తన రూటును మార్చుకున్నట్లు తెలుస్తోంది.

దీంట్లో భాగంగానే రష్యా పై యుద్ధంలో.. ఉక్రెయిన్ అత్యాధునిక మిస్సైల్స్(క్షిపణులు) ను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ దేశానికి చెందిన 'స్టార్మ్ షాడో' క్రూజ్ మిస్సైల్స్(క్షిపణులు) ను ఉక్రెయిన్ కు అందించేందుకు ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రష్యా భూభాగంపై పాశ్చాత్య దేశాలకు చెందిన ఆయుధాలు వాడటంపై ఒక పరిమితి(Limit) అనేది ఉంది. కాగా ఈ ఆయుధాలను(స్టార్మ్ మిస్సైల్స్) ఉక్రెయిన్ కు వాడటానికి అనుమతిస్తే కనుక, పాశ్చాత్య దేశాలు తమ దేశంతో నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఏంటి.. ఈ 'స్టార్మ్ షాడో'(Storm Shadow)..?

స్టార్మ్ షాడో(Storm Shadow).. అనేది బ్రిటిష్ పేరు కాగా, ఫ్రాన్స్ ఈ మిస్సైల్(క్షిపణి) ను 'SCALP-EG' అనే పేరుతో పిలుస్తోంది. ఈ మిస్సైల్ ను 1994 లో 'మాత్ర అండ్ బ్రిటిష్ ఏరో స్పేస్'(Matra and British Aero Space(MATRA BAe Dynamics)) అభివృద్ధి చేసింది.

ఇది ఒక ధీర్ఘ శ్రేణి క్రూజ్ మిస్సైల్. దీనిని బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.స్టెల్త్ టెక్నాలజీ(Stealth technology) తో రూపొందిన ఈ మిస్సైల్(క్షిపణి) ను గాలిలో నుంచి ప్రయోగిస్తారు. ఇది 150 మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం చేధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే దీనిని యూఎస్ఎస్ఆర్(యూఎస్ఎస్ఆర్ లో రష్యా, ఉక్రెయిన్ భాగం) కు చెందిన ఎస్ యూ-24 బాంబర్లతో సహా ఉక్రెయిన్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే వీలుంది.

ఇదిలా ఉండగా, ఈ మిస్సైల్స్(క్షిపణులు) ను ఇతర దేశాలకు ఇవ్వడం పై కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అయితే ఈ మిస్సైల్స్(క్షిపణులు) ను ఉక్రెయిన్ కనుక ఉపయోగిస్తే.. రష్యా నుంచి స్పందన అంతకు రెట్టింపు ఉండొచ్చని, వీలైతే రష్యా అణ్వాయుధాలను సైతం ప్రయోగించడానికి వెనకాడబోదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed