Uber : ఉబెర్ కు బిగ్ షాక్..భారీ జ‌రిమానా విధించిన నెద‌ర్లాండ్

by Maddikunta Saikiran |
Uber : ఉబెర్ కు బిగ్ షాక్..భారీ జ‌రిమానా విధించిన నెద‌ర్లాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబెర్(UBER)కు బిగ్ షాక్ తగిలింది. ఆ సంస్థకు నెద‌ర్లాండ్ కు చెందిన డేటా ప్రొటెక్ష‌న్ అథారిటీ భారీ జ‌రిమానా విధించింది. ఉబెర్ కు దాదాపు 32.4 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా వేశారు. యురోపియ‌న్ డ్రైవ‌ర్ల వ్యక్తిగత వివ‌రాల‌ను అమెరికాకు ఉబెర్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్ దేశ రాజధాని హేగ్‌లోని డేటా ప్రొటెక్ష‌న్ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఓ ప్రముఖ వార్త సంస్థ యొక్క నివేదిక ప్రకారం,అమెరికా(US), ఉబెర్ కు మధ్య రెండేళ్లుగా డేటా ట్రాన్స్‌ఫ‌ర్ జ‌రిగింద‌ని, యురోపియ‌న్ యూనియ‌న్ జ‌న‌ర‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ రెగ్యులేష‌న్(GDPR) రూల్స్‌ను ఉబెర్ ఉల్లంఘించిందని డచ్ డేటా ప్రొటెక్ష‌న్ అథారిటీ పేర్కొన్న‌ది.

కాగా EU దేశాలు 2018లో ఈ GDPR చట్టాలను ఆమోదించాయి. ఈ చట్టం ప్రకారం కంపెనీలు వినియోగదారుల డేటాను ఇతర వ్యక్తులకు కానీ వేరే దేశాలకు ట్రాన్స్‌ఫ‌ర్ చేయకూడదు.కానీ Uber డేటా బదిలీల విషయంలో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేష‌న్ (GDPR) యొక్క రూల్స్ ను ఉల్లంఘించినందున ఉబెర్ పై సంస్థాగత చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు డ‌చ్ డేటా ప్రొటెక్ష‌న్ అథారిటీ తెలిపింది. ఉబెర్ యొక్క యూరోపియన్ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లో ఉన్నందున డచ్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తమపై జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉబ‌ర్ యాప్‌ సంస్థ త‌ప్పుప‌ట్టింది. దీనిపై కోర్టులో అప్పీల్ చేయ‌నున్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed