అక్కడ 20 లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదు.. ఎక్కడో తెలిస్తే షాకవ్వాల్సిందే

by Prasanna |
అక్కడ 20 లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదు.. ఎక్కడో తెలిస్తే షాకవ్వాల్సిందే
X

దిశ, ఫీచర్స్: ప్రకృతిని అంచనా వేయాలంటే.. ఎవరి ఊహకు అందదు కూడా.. ఎందుకంటే ఇది తలచుకుంటే భయంకరమైన పరిస్థితులు కూడా సృష్టించగలదు. ప్రకృతికి కోపం తెప్పిస్తే వరదలతో ముంచెత్తగలదు. మరోక ప్రాంతాన్ని కరువు గా కూడా మార్చగలదు.

సూర్యుడు, భూమధ్యరేఖకు సమీపంలో వేడిగా ఉంటాడు కానీ ధ్రువాల దగ్గర చల్లగా ఉంటాడు. అయితే, ప్రపంచంలోని ఓ ప్రాంతంలో 20 లక్షల సంవత్సరాలుగా వర్షాలు పడటం లేదు. ఐదేళ్లు వరుసగా వర్షాలు పడని ప్రాంతాలు ఉన్నాయి కానీ లక్షల ఏళ్లుగా వర్షాలు పడని ప్రాంతాలు ఉన్నాయా అంటే.. ఉందనే చెప్పుకోవాలి. ఆ ప్రాంతం ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశం సహారా ఎడారి కాదు, ఆశ్చర్యకరంగా ఇటీవల కురిసిన వర్షాలు యూఏఈలోని ఎడారి భూమికి వరదలు తెచ్చిపెట్టాయి. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో మిలియన్ల సంవత్సరాలుగా వర్షాలు కురవకపోవడం నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజం. ఈ పొడి ప్రాంతాలలో కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతం అంటార్కిటికా ఖండంలో కరువు ప్రాంతంగా మిగిలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed