- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాకింగ్ ఘటన.. పోస్టుమార్టంకు తీసుకెళ్తుండగా తాను బతికే ఉన్నానంటు లేచిన యువకుడు
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిని ఆస్పత్రికి తరలించగా.. అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం(Postmortem) కోసం యువకుడిని తీసుకెళ్తుండగా.. తాను బతికే ఉన్నానంటూ.. లేచాడు. దీంతో అక్కడున్న వారాంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్(Uttarapredesh)లోని మీరట్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షగున్ శర్మ(Shagun Sharma) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం తాను బతికే ఉన్నానని చెప్పడంతో షాక్ కు గురైన డాక్టర్లు హుటాహుటిన ఐసీయూ కి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రాణాలతో ఉన్న వ్యక్తిని చనిపోయాడని ఎలా చెప్పారంటూ.. సదరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్లపై సీరియస్ అయ్యారు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.