Sadar Sammelan : యాదవులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం

by Ramesh N |   ( Updated:2024-11-02 09:14:20.0  )
Sadar Sammelan : యాదవులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: Yadavs యాదవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యదవులు ఘనంగా జరుపుకునే సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు శనివారం స్టేట్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. Sadar Sammelan as state festival రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనాన్ని ప్రతి ఏడాది నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

సదర్ సమ్మేళనం ట్రాఫిక్ ఆంక్షలు

కాగా, ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో యాదవులు సదర్ సమ్మేళనం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. నేడు శనివారం నిర్వహించే సదర్ సమ్మేళనంలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరొందిన దున్నపోతులు నగరానికి చేరకున్నాయి. హర్యానాకు చెందిన ఏడడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుతో ఉండే ‘గోలు 2’ అనే దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లోని దున్నరాజులు కూడా సదర్‌లో తమ విన్యాసాలను చూపనున్నాయి. సదర్ సమ్మేళనం దృష్ట్యా నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని నగర పోలీసులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed