Cf : టైగర్ జోన్ సంరక్షణకు గిరిజనుల సహకారం ఎంతో అవసరం

by Sridhar Babu |
Cf  : టైగర్ జోన్ సంరక్షణకు గిరిజనుల సహకారం ఎంతో అవసరం
X

దిశ, ఆసిఫాబాద్ : టైగర్ జోన్ సంరక్షణకు ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీ గిరిజన సహాయ సహకారాలు ఎంతో అవసరమని సీఎఫ్ శాంతారామ్ అన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేలా గుస్సాడీ దండారీ చిత్రాన్ని గీసి ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్రు చేతులమీదుగా అవార్డు అందుకున్న జైన్నూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనంద్ రావును శనివారం జిల్లాలోని డీఎఫ్ఓ కార్యాలయంలో డీఎఫ్ఓ నీరజ్ కుమార్ తో కలిసి ఆయన శాలువా కప్పి సన్మానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎఫ్ మాట్లాడుతూ జిల్లాలోని టైగర్ జోన్ సంరక్షణకు స్థానిక గిరిజన యువకులకు టైగర్ జోన్ పై అవగాహన కల్పించి, వారి సహకారం పొందాలని అధికారులకు సూచించారు. అలాగే మడావి ఆనంద్ రావు తరహాలో జిల్లాలోని ప్రతిభ కల్గిన ఆదివాసీ గిరిజన యువ కళాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఐటీడీఏ పీఓ చొరవ చూపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed