- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంథనిలో బెల్ట్ జోరు..పుట్టగొడుగుల్లా వెలుస్తున్న షాపులు
దిశ,మంథని : మంథని లో బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తోంది. మండలంలోని గ్రామాలతోపాటు మున్సిపాలిటీలో గల్లీగల్లికీ విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఈ వ్యాపారం నడుస్తుంది. దీంతో గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉండడం, పగలు, రాత్రి అని తేడా లేకుండా దొరకడంతో మద్యానికి బానిసలవుతున్నారు. పొద్దంతా కష్టం చేసుకుని సాయంత్రం పూట సేద దీరడానికి గ్రామాల్లో మద్యం సేవిస్తుంటారు. కానీ బెల్ట్ షాపులు గ్రామాల్లో పుట్ట గొడుగుల్లా వెలవడంతో వేకువజాము నుంచే బెల్ట్ షాపుల వద్ద పడిగాపులు కాస్తూ మద్యాన్ని సేవిస్తుండడం కనిపిస్తుంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అనారోగ్యం పాలు కావడంతో పాటు అప్పుల పాలు కూడా అవుతున్నారు. దీంతో పచ్చని కాపురాలు రోడ్డున పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాసులకు కక్కుర్తి పడి బెల్ట్ షాపులు నడిపే వ్యాపారులు అక్రమంగా మద్యాన్ని అమ్ముతూ మద్యంప్రియులు నుంచి అందినకాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో బెల్ట్ షాపుల వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా తమ వ్యాపారాన్ని సాఫీగా నడిపిస్తున్నారు.
మద్యానికి బానిసలవుతున్న యువత...
గ్రామాల్లో వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్నారు. దీంతో యువత పెడదారి పడుతున్నారు. గ్రామాల్లో గల్లీగల్లీకో బెల్ట్ షాపులు వెలువడడంతో మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా మద్యం సేవించడం తో గొడవలు జరగడం వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో యువత మద్యానికి బానిసలై తమ అమూల్యమైన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ..
గ్రామాల్లో వీధి వీధికి పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులపై అధికారుల పర్యవేక్షణ కరువైనట్లు ఆ షాపులను చూస్తేనే తెలుస్తోంది. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, అధికారులపై గ్రామాల్లో సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వైన్స్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం తరలించకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.