OU JAC: ఆంధ్రా ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లాలి.. జేఏసీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
OU JAC: ఆంధ్రా ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లాలి.. జేఏసీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రా ఫిల్మ్ ఇండస్ట్రీ(Andra Film Industry) మొత్తం తట్టా బుట్టా సర్ధుకొని తెలంగాణ(Telangana) నుంచి వైజాగ్(Vizag) వెళ్లిపోవాలని ఓయూ జేఏసీ చైర్మన్(OU JAC Chairman) ప్రొ. గాలి వినోద్ కుమార్(Pro.Gali Vinod Kumar) డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మాట్లాడుతూ.. అల్లు అర్జున్(Allu Arjun) నివాసంపై ఓయూ జేఏసీ నేతలు చేసిన దాడిని సమర్థించారు. ఆయన మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఓ మహిళ మృతికి, ఓ బాలుడు కోమాలోకి వెళ్లడానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడని మండిపడ్డారు. ఓయూ జేఏసీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసిన తర్వాతనే, నిర్మాతలు దిగివచ్చి బాధిత కుటుంబానికి 50 లక్షలు పరిహారం ఇచ్చారని, ఓయూ జేఏసీ దాడిని సమర్ధిస్తున్నామని అన్నారు.

అంతేగాక దాడులు జరిగితేనే స్పందిస్తామంటే.. విద్యార్థులు మొత్తం దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వానించారని.. ఆంధ్రా సినిమా రంగం అంతా తెలంగాణ నుంచి తరలి వెళ్లాలని, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) వేదికగా మరో ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చి పదేళ్ల గడువు పూర్తి అయ్యిందని, ఆంధ్రా ఫిలిం ఇండస్టీ వాళ్లు రానున్న సంక్రాంతి(Sankranthi) లోపు వైజాగ్ వెళ్లి అక్కడే స్థిరపడాలని అన్నారు. తెలంగాణ వాళ్లకు అవకాశాలు ఉండట్లేదని, తెలంగాణలో సినిమాలు తీస్తే.. 24 కళలలో తెలంగాణ వ్యక్తులకు 85 శాతం అవకాశాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక ఆంధ్రా వాళ్లు వైజాగ్ లో కొత్త స్టూడియోలు కట్టుకొని, ఇక్కడ ఉన్న స్టూడియోలను తెలంగాణలోని ప్రోడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలకు లీజుకు ఇచ్చి వెళ్లి పోవాలని జేఏసీ చైర్మన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed