I&PR మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌పై ఏసీబీ కేసు

by Gantepaka Srikanth |
I&PR మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌పై ఏసీబీ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ I&PR మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌‌(Vijay Kumar)కు అనూహ్య షాక్ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. టెండర్లు పిలవకుండా నిబంధనలు ఉల్లంఘించి.. ఇష్టానుసారంగా పోస్టులు ఇచ్చారని అభియోగాలు రావడంతో 120బీ, సెక్షన్ 7, 12(2), రెడ్‌విత్13(1A) కింద కేసులు నమోదు చేశారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన రాజీనామాను సీఎస్ జవహర్‌రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేశారు.

Advertisement

Next Story