TPCC: ఈ జిమ్మిక్కులు కేసీఆర్ నమ్ముతారు, ప్రజలు కాదు.. మన్నె క్రిశాంక్‌కు సామా కౌంటర్

by Ramesh Goud |
TPCC: ఈ జిమ్మిక్కులు కేసీఆర్ నమ్ముతారు, ప్రజలు కాదు.. మన్నె క్రిశాంక్‌కు సామా కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ఇలాంటి జిమ్మిక్కులు కేసీఆర్(KTR) నమ్ముతారు.. ప్రజలు కాదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) అన్నారు. నన్ను ఇరికించడానికి కొత్త స్కీమా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్(BRS leader Manne Krishank) చేసిన ట్వీట్ కు సామా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా.. మిస్డ్ కాల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేయడానికి బదులుగా, కేసును నేరుగా నిరూపించడానికి కాల్ రికార్డింగ్ ఆడియోను పోస్ట్ చేసి ఉండాల్సింది అని ఎద్దేవా చేశారు.

అంతేగాక మీరు అలా చేయరని, ఎందుకంటే కేటీఆర్(KTRBRS) టీమ్ చీప్ ప్లాన్లు.. వాటి అమలులు బహిర్గతమవుతాయని చెప్పారు. ఇక ఈ రకమైన స్క్రీన్‌షాట్ జిమ్మిక్కులతో మీ ఫామ్ హౌస్ బాస్ కేసీఆర్‌ని నమ్మించవచ్చు, కానీ ప్రజలను కాదని సామా వెల్లడించారు. కాగా బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తన ఫోన్ స్క్రీన్ షాట్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ఇది మీ కొత్త స్కీమా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన మీ కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంట క్రితం నా మొబైల్ నంబర్‌కు ఎందుకు కాల్ చేసాడని, మీడియా చర్చల్లో పాల్గొనకుండా బెదిరించడానికా? లేక నన్ను ఇరికించడానికా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed