మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో మలేషియా బృందం భేటీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-24 16:49:30.0  )
మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో మలేషియా బృందం భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో మహిళల పట్ల వివక్షతను తొలగించి, జెండర్ సెన్సిటైజేషన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతపై దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం బుద్ధ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో తెలంగాణలో మహిళా కమిషన్ తీరు తెన్నులపై మలేషియా పారిశ్రామిక వేత్తల బృందం చైర్ పర్సన్‌తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు, పనితీరును మలేషియా ప్రతినిధుల అడిగి తెలుసుకున్నారు. మహిళల హక్కులను పరిరక్షించడం కోసం కమిషన్ ఏర్పాటు చేశామని చైర్మన్ శారద వివరించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed