మహిళలు స్వశక్తితో ఎదగాలి

by Naveena |
మహిళలు స్వశక్తితో ఎదగాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహిళలు స్వశక్తితో ఎదిగి,ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా జీవించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 'ఫస్ట్' కార్యాలయంలో ఆయా ట్రేడ్ లలో శిక్షణ పొందుతున్న 240 మంది మహిళలకు ఆయన ఉచితంగా ఆయా ట్రేడ్ లకు సంబంధించిన మెటీరియల్స్ అందజేసి మాట్లాడారు.ఇక్కడ మీరు నేర్చుకున్న శిక్షణ మీ జీవితానికి ఆధారం కావాలని,మీ కాళ్ళపై మీరు నిలిచి మహబూబ్ నగర్ వారికే కాకుండా రాష్ట్రంలోని వారికి స్పూర్తిగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,టిపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,సిరాజ్ ఖాద్రీ,సాయిబాబా,రాములు యాదవ్,గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

యాదవులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తుంది

యాదవులకు రాజకీయంగా తమ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం టిఎన్జీఓల సంఘ భవనంలో అఖిలభారత యాదవ్ మహాసభ నూతన సంవత్సర క్యాలండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.జిల్లాలో యాదవుల జనాభాను దృష్టిలో ఉంచుకొని లక్ష్మణ్ యాదవ్ కు కీలకమైన మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మెన్ పదవిని ఇచ్చి ప్రాధాన్యత కల్పించామని ఆయన అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యాదవులకు తగిన ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తాటికొండ నరసింహ యాదవ్,మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ జిల్లా చైర్మెన్ శాంతన్న యాదవ్,వెంకట నరసయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed