CM Revanth: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
CM Revanth: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో యాదవరెడ్డి రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని చైనా(China) ఆక్రమించిందని అన్నారు. రెండు వేల నుంచి 4 వేల కి.మీ వరకు ఆక్రమించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై చర్చించేందుకు పాలకులకు ధైర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు అక్కడ ఆధునాతన ఆయుధాలే కారణమని ఆరోపించారు.

మణిపూర్‌(Manipur)లో శాంతి కోసం భారత బలగాలు అక్కడి ఆయుధాలను సీజ్‌ చేయలేవా? అని ప్రశ్నించారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై పార్లమెంట్‌(Parliament)లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై చర్చ జరగాలి.. ఆ చర్చను దేశ ప్రజలు మొత్తం వినాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే దేశంలో శాంతి నెలకొంటుందని రేవంత్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed