- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:‘పుష్ప-2’ ఎపిసోడ్‌లో తలనొప్పిగా మారిన ‘గంటా’ వ్యవహారం!?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పుష్ప-2 సినిమా తిలకించడానికి హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు వచ్చి మరణించిన, గాయపడిన వారిని పలకరించకుండా అందుకు కారణమైన సినీ నటుడు అల్లు అర్జున్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ సంఘటనపై పోస్టింగులు చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీతోపాటు, ఆ పార్టీ సోషల్ మీడియా అల్లు అర్జున్‌ను ఓన్ చేసుకొని మద్దతుగా నిలబడుతోంది.
గంటాతో తంటానే..
టీడీపీకి చెందిన మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు విచిత్రంగా, పార్టీ క్యాడర్ అభీష్టానికి విరుద్ధంగా ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి మరీ అల్లు అర్జున్‌ను పరామర్శించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాగానే డిసెంబర్ 14వ తేదీన హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళిన గంటా శ్రీనివాసరావు ఆయనను, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అంతటితో ఆగక అదేదో ఘనకార్యం సాధించినట్లు ఆ ఫొటో సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు మీడియాకు విడుదల చేశారు. ఈ పరిణామాన్ని తెలుగుదేశం కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ అంతా ఒకవైపు ఉండగా గంటా వంటి కొందరు నేతలు మరోవైపు ఉండటమేమిటనే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి తప్పు పట్టింది.. కూడా ఇటువంటి పరామర్శలనే..
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు, ఒక తల్లి మృతికి కారణమైన అల్లు అర్జున్‌ను పెద్ద ఎత్తున పరామర్శించటం ఏమిటని ధ్వజమెత్తారు. బాధితులను పరామర్శించకుండా సంఘటనకు కారణమైన వారిని పరామర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పించారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు రేవంత్ రెడ్డి ప్రసంగాలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంఘటనలో అల్లు అర్జున్‌దే నూటికి నూరు శాతం తప్పు అంటూ ధ్వజమెత్తారు.
మీ గంటా కూడా ఉన్నారుగా..
ఇదే సమయంలో మీ పార్టీకే చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పరామర్శించిన వారి జాబితాలో ఉన్నారు కదా? అంటూ ఎదురు దాడి ప్రారంభమైంది. దీనికి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా రుషికొండ ప్యాలెస్ తలుపులు తెరిచి సందర్శించడం ద్వారా అధిష్టానం ఆగ్రహానికి గురైన గంటా ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో పార్టీకి తలనొప్పిగా మారారు. ఇటువంటి సున్నితమైన అంశాలలో పార్టీ లైన్ ఏమిటో తెలుసుకోకుండా తమ ఇష్టానుసారం వ్యవహరించడం ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.