CM Revanth Reddy: తప్పుచేస్తే కఠిన నిర్ణయాలు.. నూతన వీసీలకు సీఎం దిశానిర్దేశం

by Prasad Jukanti |
CM Revanth Reddy: తప్పుచేస్తే కఠిన నిర్ణయాలు.. నూతన వీసీలకు సీఎం దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కొంత కాలంగా యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతోందని, కొత్త వీసీలంతా యూనివర్సిటీలపైన తిరిగి నమ్మకం కలిగించేలా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. ఇటీవల యూనివర్సిటీలకు పలు నియమితులైన నూతన వైస్ చాన్స్ లర్లు (University VCs) శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వీసీలతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) హాజరైన ఈ సమావేశంలో నూతన వీసీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం సూచించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలన్నారు సూచించారు.

వైస్ ఛాన్సలర్లకు ఎవరి ప్రభావితంతో పోస్ట్ లు ఇవ్వలేదని మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేశామన్నారు. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. తప్పు జరిగితే ఆశ్చర్యపడేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సో వస్తుందని హెచ్చరించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్ల కి స్వేచ్ఛ ఉంటుందని అందుకోసం ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాలన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. యూనివర్సిటీ ల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలని వీసీలకు సూచించారు. విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed