సర్కార్ కీలక ఉత్తర్వులు.. ఆ ఇద్దరు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్

by Shiva |
సర్కార్ కీలక ఉత్తర్వులు.. ఆ ఇద్దరు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: క్యాట్‌ తీర్పు, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఐపీఎస్ అంజనీ కుమార్ (Anjani Kumar), అభిలాష బిస్త్‌ (Abhilasha Bist)లు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో రిపోర్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి రిలీవైన ఆ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు తాజాగా పోస్టింగ్స్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీగా అంజనీకుమార్, రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అభిలాష బిస్త్‌లను నియమిస్తూ సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఐపీఎస్ అంజనీ కుమార్ గతంలో తెలంగాణ డీజీపీగా కూడా విధులు నిర్వర్తించారు. ఇక అభిలాష బస్త్ ప్రస్తుతం లీవ్ ఉన్నారు. సెలవుల అనంతరం ఆమె తిరిగి విధుల్లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఐపీఎస్ కుమార్ విశ్వజీత్‌ (Kumar Vishwajeeth)కు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అడిషనల్ చార్జ్ ఇచ్చారు.

కాగా, వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో అంజనీ కుమార్ (Anjani Kumar), అభిలాష బిస్త్‌ (Abhilasha Bist)లను ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కు కేటాయించారు. కానీ, వారు ట్రిబ్యూనల్‌ ఆదేశాల మేరకు ఇన్నాళ్లు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల క్యాట్ వారిని వెంటనే ఏపీ కేడర్‌లో చేరాలని, వెంటనే రిలీవ్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఇద్దరు ఐపీఎస్‌‌లు అక్కడికి వెళ్లక తప్పలేదు.



Next Story

Most Viewed