Srinivas Goud: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. నిలబెట్టుకొని తీరాల్సిందే

by Gantepaka Srikanth |
Srinivas Goud: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. నిలబెట్టుకొని తీరాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో(local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) గుర్తుచేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత బీసీ జనాభా లెక్కించడానికి బీసీ కమిషన్(BC Commission) ఏర్పాటు చేశారు. చట్టాన్ని తయారు చేసుకోకుండా సర్వే చేస్తున్నారు. రెండు వేర్వేరు జీవోలు ఇచ్చారు. చాలా గందరగోళం ఉంది అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మళ్ళీ కాలయాపన జరిగే ప్రమాదం ఉందని అట్టడుగు వర్గాల్లో ఆందోళన ఉందని తెలిపారు.

కులగణన(Caste Census) విషయంలో బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన తప్పదాలే ఇక్కడ కూడా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని అన్నారు. రాహుల్ గాంధీ కులగణన(Caste Census) ఓ ఎక్స్‌రే లాంటిదని అంటున్నారు. మేము ఎంఆర్ఐ లాంటిదని అంటున్నాం అని అన్నారు. కులాలు, ఉపకులాల జనాభా సర్వేతో కచ్చితంగా తేలుతుంది. తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా చేయాలి. బీసీ కమిషన్ జిల్లాల్లో పర్యటనలను జిల్లా కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story