చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

by Harish |
చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. పాక్‌లో పర్యటించడానికి భారత్ నిరాకరించడంతో టోర్నీ నిర్వహణపై అనుమానాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, హైబ్రిడ్ మోడల్‌కు ఇటీవల ఆమోదం లభించడంతో ప్రతిష్టంభన వీడింది. టీమిండియా తన మ్యాచ్‌లను తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుండగా.. మిగతా టోర్నీ పాక్‌లో జరగనుంది. ఈ క్రమంలోనే ఐసీసీ మంగళవారం టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. కరాచీ వేదికగా పాక్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. మార్చి 9న ఫైనల్. 8 జట్లు పాల్గొనే టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూపు-ఏలో చేర్చగా.. గ్రూపు-బిలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాక్ పోరు ఫిబ్రవరి 23న జరగనుంది. అంతకుముందు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో టీమిండియా టోర్నీని ఆరంభించనుంది. మార్చి 2న చివరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మార్చి 4, 5 తేదీల్లో సెమీస్‌లు నిర్వహించనున్నారు. మార్చి 9న ఫైనల్ లాహోర్‌ వేదికగా షెడ్యూల్ చేశారు. టైటిల్ పోరుకు టీమిండియా అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ దుబాయ్‌లో నిర్వహిస్తారు. సెమీస్‌ మ్యాచ్‌లకు, ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు.


Advertisement

Next Story

Most Viewed