- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెల్లారేసరికి ఇల్లు గుల్ల
దిశ, శంషాబాద్ : ఓ ఇంట్లో కుటుంబం నిద్రించి తెల్లారి నిద్ర లేచి చూసేసరికి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ క్రైమ్ సీఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం… రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ మ్యాపిల్ టౌన్షిప్ విల్లాస్ లో ఉండే డాక్టర్ కొండల్ రెడ్డి సోమవారం రాత్రి భోజనం చేసి అతని కుటుంబం పడుకున్నారు. మంగళవారం తెల్లారి లేచి చూసేసరికి ఇంట్లో ఉన్న బంగారం, నగదు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. డాక్టర్ కొండల్ రెడ్డి గత నెల రోజుల క్రితం బీహార్ చెందిన భార్య భర్తలను పని మనుషులుగా నియమించుకున్నాడు.
అయితే వారి దగ్గర ఎలాంటి ఆధారాలు ధృవపత్రాలు తీసుకోకుండా పెట్టుకోవడం వల్ల వారు నెల రోజులపాటు ఇంటి యజమాని నమ్మించి, యజమాని నిద్రలోకి జారుకున్న వెంటనే ఆ దంపతులు ఇంట్లో ఉన్న రూ. 35 వేల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారని, ఫిర్యాదు ఆధారంగా ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రైమ్ సీఐ నవీన్ మాట్లాడుతూ… ఇంట్లో పనికి పెట్టుకునే వ్యక్తుల వద్ద నుండి వారి పూర్తి వివరాలు ఆధార్ కార్డు లాంటి ఆధారాలను తీసుకుని పనిలో పెట్టుకోవాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పని వాళ్ళని పెట్టుకుంటే చోరీ లే కాకుండా గతంలో ఇతర ప్రాంతాలలో హత్యలు కూడా జరిగాయి అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వారిని వాకాపు చేయాలన్నారు. ఒకవేళ అనుమానం కలిగితే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.