Congress: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్

by vinod kumar |
Congress: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్(Congress) రెండో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 26 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జంగ్‌పురా స్థానం నుంచి ఫర్హాద్ సూరి (Farhad soori)కి చాన్స్ ఇచ్చింది. ఈ సెగ్మెంట్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish sisodiya) బరిలో ఉన్నారు. అలాగే సోమవారం కాంగ్రెస్‌లో చేరిన ఆప్‌ మాజీ ఎమ్మెల్యేలు అసిమ్‌ఖాన్‌, దేవేందర్‌ సెహ్రావత్‌లకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక, బాబర్‌పూర్‌ స్థానం నుంచి ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ రాయ్‌పై హాజీ మహమ్మద్‌ ఇష్రాక్‌ ఖాన్‌ బరిలో నిలిచారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీకి పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్ అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతకుముందు తొలి జాబితాలో 21 మంది పేర్లు విడుదలయ్యాయి. దీంతో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 40 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం 2025 ఫిబ్రవరి 23న ముగియనుంది.

Advertisement

Next Story