రెచ్చిపోయిన కామాంధులు.. ఆటోలో బాలిక పై లైంగిక దాడి..

by Sumithra |
రెచ్చిపోయిన కామాంధులు.. ఆటోలో బాలిక పై లైంగిక దాడి..
X

దిశ, జూబ్లీహిల్స్ : స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అదే ఆటోలో ప్రయాణించిన దుండగులు కటిక కామాంధులు లైంగిక వేధింపులు చేస్తూ, ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ పైశాచికానందం పొందారు. అడ్డుకునే ప్రయత్నించిన బాలిక స్నేహితుడు, ఆటో డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. నిందితులను ఆటో నుంచి బలవంతంగా దింపేసినా మళ్లీ ఆటో ఎక్కి మరీ వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం బీహార్ కు చెందిన బాలిక బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్లోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నది. సోమవారం సాయంత్రం జీతం కోసం మాదాపూర్ వెళ్లింది. ఈ క్రమంలో అదే హోటల్లో కుక్ గా పనిచేసే బీహార్ కు చెందిన యువకుడు (18)తో కలిసి రాత్రి 10.40 గంటల సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది.

మార్కెట్ వద్ద ఐదుగురు యువకులు ఆటోను అడ్డగించారు. వారిలో నుంచి ఇద్దరు ఆటో ఎక్కగా, వారిలో ఒకడు బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకడు డ్రైవర్ పక్కన కూర్చోగా, మిగతా వారు ఆటోను అనుసరిస్తూ బైక్ పై వచ్చారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బాలిక స్నేహితుడితో పాటు ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో యువకులు దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ ధైర్యంగా వారితో పోరాడి ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు. అయినా వదలని నిందితులు పరుగులు పెడుతూ ఆటోలోకి చేరుకున్నారు. అయినా ఆటోను ఆపని డ్రైవర్ నేరుగా బాలిక ఇంటి వద్ద ఆమెను దింపేశాడు. అయినప్పటికీ ఆగని నిందితులు ఇంట్లోకి జొరబడి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదల్లేదు. దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరుగింటి వ్యక్తి డయల్ 100కు ఫోన్ సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిమీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

Next Story

Most Viewed