క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

by Sumithra |
క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
X

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రజ్ పల్లి సత్య దైవార్చనాలయంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, భారత దేశం సర్వ మతాల సమ్మేళనమని అన్నారు. ప్రేమ, సహనం, త్యాగం, దాతృత్వమనే సుగుణాల ఆచరణతో మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన ఏసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగ స్వామి యాదవ్, లింగంపల్లి కిరణ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed