- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health: డయాబెటిస్ బాధితులా..? వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
దిశ, ఫీచర్స్ : మీరు డయాబెటిస్ బాధితులా..? అయితే వింటర్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చల్లటి వాతావరణం మీలో మరిన్ని సమస్యలకు కారణం కావచ్చు. ముఖ్యంగా రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుందని, ఇన్‌ఫెక్షన్లు, పలు వ్యాధుల రిస్క్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చల్లని వాతావరణం కారణంగా సరిగ్గా తినకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం వంటివి కూడా రక్తంలో చక్కెరస్థాయిలు పెరగడానికి దారితీస్తాయి. అలా జరగకూడదంటే ఏం చేయాలో చూద్దాం.
*డిసెంబర్‌లో చల్లటి వాతావరణం డయాబెటిస్ పేషెంట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన షుగర్ పేషెంట్లలో జలుబు, దగ్గు, జ్వరం, వివిధ ఇన్‌ఫెక్షన్లు వంటివి వచ్చేఅవకాశం మిగతా వారికంటే ఎక్కువగా ఉంటుంది. పైగా త్వరగా తగ్గవు. అందుకే మీ శరీరానికి పడని వాతావరణం నుంచి తప్పించుకోవాలంటున్నారు నిపుణులు. అందుకోసం వెచ్చటి దుస్తులు, చెవులను కవర్ చేసేలా ఉన్ని క్యాపులు, మఫ్లర్లు వంటివి ధరించడం చేయాలి. అలాగే మందులు క్రమం తప్పకుండా వాడాలి. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ వ్యాయామాలు మాత్రం ఆపకూడదు. బయటకు వెళ్లకపోయినా ఇంట్లోనే ఉండి చేయాల్సిన వర్కౌట్స్‌ను ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల షుగర్ పేషెంట్లలో రోగ నిరోధక శక్తి పెరిగి, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.
*షుగర్ బాధితులు వింటర్‌లో హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. తాజా కూరగాయలు, ఫైబర్ ఉండే పండ్లు రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. అలాగే వెజిటేబుల్ సూప్‌లు, సీడ్స్, నట్స్ వంటివి తీసుకోవడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక జలుబు, జ్వరం వంటివి వచ్చి రెండుమూడు రోజులకంటే ఎక్కువగా కొనసాగితే ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించాలి. అలాగే రెగ్యులర్‌గా రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, చల్లటి వెదర్ ఉన్నప్పటికీ శరీరానికి సరిపడా నీళ్లు తాగడం, ఒత్తిడి, ఆందోళనలు వంటి పరిస్థితులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.