పెళ్లికి సిద్ధమైన నవీన్ పొలిశెట్టి.. ప్రీ వెడ్డింగ్ వీడియో త్వరలోనే అంటూ పోస్ట్

by sudharani |   ( Updated:2024-12-25 14:19:44.0  )
పెళ్లికి సిద్ధమైన నవీన్ పొలిశెట్టి.. ప్రీ వెడ్డింగ్ వీడియో త్వరలోనే అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్న హీరో నవీన్ పొలిశెట్టి.(Naveen Polishetty) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’(Agent Sai Srinivasa Atreya) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీలో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. తర్వాత ‘జాతిరత్నాలు’(Jathi Ratnalu)తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మరింత క్రేజ్ తెచ్చుకున్న నవీన్.. గతేడాది ‘మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr Polishetty )తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రజెంట్ ఈ హీరో వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ పొలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’(Anaganaga Oka Raju).

ఈ సినిమాతో కల్యాణ్ శంకర్(Director Kalyan Shankar) డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితారఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన నవీన్ పొలిశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు ‘జానేజీగార్లు.. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి మళ్లీ వచ్చాడు.. 'రిచ్' అండ్ అత్యంత వినోదభరితమైన ‘అనగనగా ఒకరాజు’ ప్రీ వెడ్డింగ్ (Pre wedding)టీజర్ డిసెంబర్ 26న రాబోతుంది’ అని తెలియజేస్తూ.. టీజర్ రిలీజ్ చేశారు.

‘సర్ ఎరేంజ్మెంట్స్ కుమ్మేశారు.. పెళ్లికి కేజీఎఫ్ గోల్డ్ మొత్తం దించేసినట్లు ఉన్నారుగా’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో జబర్దస్త్(Jabardast) ఫేమ్ చమ్మక్ చంద్ర(Chammak Chandra) ‘ఎవరి పెళ్లి అనుకుంటున్నారురా మీరు.. రాజుగారి పెళ్లిరా’ అని చెప్పిన డైలాగ్‌తో నవీన్ పొలిశెట్టి ఎంట్రీ ఉంటుంది. చేతి వేళ్లకు ఫుల్‌గా గోల్డ్ రింగ్స్ పెట్టుకుని ఉన్న హీరో లుక్‌ను బ్యాక్ నుంచి మాత్రమే రివీల్ చేశారు చిత్ర బృందం. అంతే కాకుండా.. ‘పీ వెడ్డింగ్ టీజర్ డిసెంబర్ 26న రిలీజ్ కాబోతుంది’ అని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed