CNG MP: నన్ను అధికారిక కార్యక్రమాలకు పిలవట్లేదు.. తెలంగాణ కాంగ్రెస్ MP ఆవేదన

by Gantepaka Srikanth |
CNG MP: నన్ను అధికారిక కార్యక్రమాలకు పిలవట్లేదు.. తెలంగాణ కాంగ్రెస్ MP ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో తనకు ప్రొటోకాల్ లభించడం లేదని కాంగ్రెస్(Congress) ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Gaddam Vamsi Krishna) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడం లేదని అన్నారు. కాకా వర్థంతి వేడుకలు కూడా నిర్వహించలేదని తెలిపారు. కాకా(KAKA) వర్థంతిని జరుపకపోవడం అంటే దళితజాతిని అవమానపరిచినట్లే అని వెల్లడించారు. కాకా పోరాటంతోనే నిరుపేదలకు ఇండ్లు వచ్చాయని అన్నారు. కాకా ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. పేదలు, బడుగులకు న్యాయం జరగాలని కాకా తపించేవారని చెప్పారు. అన్ని రంగాలకు కాకా స్ఫూర్తి అని అన్నారు. 50 ఏళ్లలో ఎంతోమంది విద్యావంతులు అయ్యారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు కాకా కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాకా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఢిల్లీలో సొంతింటిని కాకా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed