- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt: సంక్రాంతి వేళ రైతులకు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్..!
దిశ, తెలంగాణ బ్యూరో: సాగుచేసే భూములన్నింటికీ రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఎలాంటి సీలింగ్ విధించకుండా ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకూ రూ.7,500 చొప్పున ఏటా రెండు విడతలుగా లబ్ధిదారులకు సాయం అందించనున్నది. బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫాంహౌజ్‌లకు ఈ స్కీంను అమలు చేయొద్దని రేవంత్ సర్కారు నిర్ణయించుకున్నది. సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్ట్ లెవల్ రిపోర్టుతోపాటు, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నది. ఈ నెల 30న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతుభరోసా విధివిధానాలకు ఆమోద ముద్ర వేయనున్నది.
రిమోట్ సెన్సింగ్ సపోర్ట్!
ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి? అందులో సాగు చేస్తున్నది ఎంత? అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయి. కానీ, సాగు భూములకే పంటసాయం అందించాలనే కండీషన్ పెట్టడం వల్ల ఫీల్ట్ స్థాయిలో సాగు భూముల వివరాలను గుర్తించే సమయంలో అవినీతి చోటుచేసుకునే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తున్నది. సర్వే నంబర్ల ఆధారంగా ఆ పంట సాగుచేశారో లేదో అని (శాటిలైట్ ద్వారా) గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
కానీ ఒక సర్వే నంబర్‌లో ఎంత మంది రైతులకు పట్టా ఉన్నదనే విషయం తేల్చడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాగు భూములను గుర్తించేందుకు శాటిలైట్ సహకారం తీసుకోవడంతో పాటుగా.. రైతులను గుర్తించేందుకు ఫీల్ట్ లెవల్ వెరిఫికేషన్ చేయాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఒక గ్రామంలో ఓ రైతు తన భూమిని సాగు చేశారా? లేదా? అనేది గుర్తించడం పెద్ద సమస్య కాదు. పొరుగున ఉన్న రైతులే ఆ విషయంపై క్లారిటీ ఇస్తారు. కానీ గుట్టలు, కొండలు, బంజరు భూములు, వెంచర్లు, ఫాంహౌస్‌లకు పంట సాయం అందకుండా చేసేందుకే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.
13 శాతం మంది రైతులకే 10 ఎకరాల కన్నా ఎక్కువ!
10 ఎకరాల విస్తీర్ణం కన్నా ఎక్కువ భూములు ఉన్న రైతులు కేవలం 13 శాతం మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు లెక్కలు తీశాయి. వీరి కోసం కండీషన్ పెట్టడం వల్ల సర్కారుపై ఆర్థిక భారం ఏ మేరకు తగ్గుతుందని విషయంపై సర్కారు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ హాయంలో పట్టా ఉన్న భూములన్నింటికీ రైతుబంధు ఇచ్చేవారు. ఇప్పుడు సాగు భూములకే అని ప్రభుత్వం కండీషన్ పెట్టింది. ‘పెద్ద రైతులు ఆర్థిక ప్రయోజనం పొందాలని చూసినా.. గుట్టలు, కొండలు, కంచెలు, ఫాంహౌస్‌లు, వెంచర్లను సాగు చేయడం సాధ్యం కాదు కదా?’ అని ఓ ఐఏఎస్ వివరించారు.
రబీలో పెరగనున్న విస్తీర్ణం
ప్రతి ఏటా యాసంగి కన్నా రబీ సీజన్‌లో పంటల సాగు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నిజానికి యాసంగిలో బోర్లు, బావులు, కాలువల కింద ఉన్న భూములు మాత్రమే సాగులోకి వస్తాయి. కానీ రబీలో వర్షాధార పంటలు సైతం సాగులోకి వస్తాయి. గత ఏడాది లెక్కల ప్రకారం వానకాలంలో కోటీ 44లక్షల 88వేల ఎకరాలు సాగుచేయగా.. యాసంగిలో 67.7 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇప్పుడు సాగు భూములకే పంట సాయం అనే కండీషన్ పెడితే, రబీలో అదనంగా మరో 10 లక్షల విస్తీర్ణంలో పంటసాగు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు రైతు భరోసా స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందేందుకు రైతులు నీటి వసతలు లేకున్నా ఎదో ఒక పంటసాగు చేసి అవకాశం ఉంటుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.