- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్య- శోభిత పెళ్లి పీటల వరకు రావడానికి ఆ స్టార్ హీరో కారణమా..? ఎట్టకేలకు బయటకు వచ్చిన సంచలన నిజం
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulipala)తో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున(Nagarjuna) ‘X’ వేదికగా ప్రకటించాడు. దీంతో అప్పటి వరకు వచ్చిన రూమర్స్ అన్ని నిజమయ్యాయని చైతన్య- శోభితలను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు శోభిత ధూళిపాళతో నాగచైతన్యకు పరిచయం ఎలా ఏర్పడింది..? వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? అసలు వీరి మధ్య ఉన్న లవ్ కారణంగానే సమంతకు విడాకులు ఇచ్చేశాడా ..? అన్న రకరకాల డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి మూమెంట్‌లోనే సోషల్ మీడియాలో వీళ్ళ ప్రేమకు సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అలాగే వీరు ప్రేమించుకొని పెళ్లి పీటల వరకు వెళ్ళడానికి కారణం ఓ తెలుగు యంగ్ హీరో అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
చైతన్య శోభితల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం అయిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు "అడవి శేష్"(Adivi Sesh). ఎస్ అడవి శేష్ నటించిన ‘గూడచారి’(Gudachari) సినిమాలో శోభిత ధూళిపాళ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆ టైంలోనే నాగచైతన్యకు ఈమె పరిచయం అయిందట. దానికి కారణం కూడా యార్లగడ్డ సుప్రియ(Yarlagadda Supriya). యార్లగడ్డ సుప్రియ - అడవి శేష్ మధ్య ఏదో ఉంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. అంతే కాకుండా అడవి శేష్ పలు అక్కినేని ఫ్యామిలీ ఫొటోస్‌లో కూడా దర్శనమిచ్చారు.
ఇక అలా ఏర్పడిన చైతన్య- శోభితల పరిచయం ఆ తర్వాత వీరిద్దరి అభిరుచులు కలవడంతో మంచి ఫ్రెండ్స్‌గా మారారట. అయితే సమంతకు విడాకులు ఇచ్చేసిన తర్వాత శోభిత ధూళిపాళ నాగచైతన్యకు బాగా సపోర్ట్ చేయడం, ఆయన డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేయడంతో ఆటోమేటిక్‌గా నాగచైతన్య ఆమె చూపించే ప్రేమకు కనెక్ట్ అయిపోయాడట. అంతేకాదు మొదటగా చైతన్యనే శోభితకి ప్రపోజ్ చేసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారట. అలా నాగచైతన్య - శోభితల పెళ్లి జరగడానికి కారణమయ్యాడు అడవి శేష్ అంటూ టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Read More : చై- సామ్ పెళ్లిలో జరిగిన ఆ తప్పుని.. శోభితతో చేయనీయకుండా జాగ్రత్త పడుతున్న నాగార్జున..?