- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IND Vs NZ: నిలకడగా ఆడుతోన్న టీమిండియా.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియం (Wankhade Stadium) వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో టీమిండియా (Team India) నిలకడగా ఆడుతోంది. శుక్రవారం ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ (New Zealand), భారత స్పిన్నర్ల ధాటికి 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో డారెల్ మిచెల్ (Daryl Mitchell) (82), వీల్ యంగ్ (Will Young) (71) పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్లు అంతా తక్కువ స్కోర్‌కే అవుటయ్యారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 5 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) 4 వికెట్లు, ఆకాశ్ దీప్ (Akash Deep) 1 వికెట్ నేలకూల్చారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా (Team India)కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) 18 బంతుల్లో 18 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ (Matt Henry) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) 52 బంతుల్లో 30 పరుగులు చేసి ఎజాజ్ పటేల్ (Ajaz Patel) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) బాధ్యతాయుతంగా ఆడుతూ.. చూడచక్కని షాట్లతో అలరించాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) డకౌట్ అయ్యాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 6 బంతుల్లో 4 పరుగులు చేసి దురదృష్టవశాత్తు మ్యాట్ హెన్రీ (Matt Henry) వేసిన అద్భుతమైన త్రో కారణంగా రనౌట్ అయ్యాడు.
రెండో రోజు 4 వికెట్లు కోల్పోయి 84 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన టీమిండియా (Team India) బ్యాట్స్‌మెన్లు శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), రిషభ్ పంత్ (Rishabh Panth)లు అర్థ శతకాలతో అదరగొట్టారు. ముఖ్యంగా పంత్ వరుసగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్, 59 బంతుల్లో 60 పరుగులు చేసి ఇష్ సోధి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. లంచ్ ముగిసేసరికి టీమిండియా 5 కీలక వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 116 బంతుల్లో 71, రవీంద్ర జడేజా 23 బంతుల్లో 13 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. భారత్, న్యూజిలాండ్ కన్నా 36 పరుగులు వెనుకబడి ఉంది.