- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fashion : ర్యాంప్ వాక్‌లో మోడల్స్ ఎందుకు నవ్వరు..? అసలు కారణం ఇదే!
దిశ, ఫీచర్స్ : ఫ్యాషన్ షోలో మోడల్స్ (models) ర్యాంప్ వాక్ చేయడాన్ని మీరు గమనించే ఉంటారు. అక్కడి వాతావరణమంతా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. కొంగ్రొత్త డిజైనర్ దుస్తులతో, ఆకట్టుకునే హావ భావాలతో వారు క్యాట్ (Cat walk) వాక్ ప్రారంభించగానే ప్రేక్షకులంతా ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. అక్కడున్న ప్రతీ ఒక్కరి మొహంపై చిరునవ్వులు చిందిస్తుంటాయి. కానీ ర్యాంప్‌పై తళుక్కుమంటున్న మోడల్స్ మాత్రం సీరియస్‌గా కనిపిస్తారు. ఈ సందర్భంగా వారు అస్సలు నవ్వరు. అయితే దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దాం.
వాస్తవానికి నవ్వు సానుకూలతకు ప్రతిరూపం. ఎదురుగా ఎవరైనా ఉన్నప్పుడు చిరు నవ్వు చిందించారంటే, మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని అవతలి వ్యక్తి భావించే అవకాశం ఎక్కువ. దీంతో అవతలి వ్యక్తి మనసులో సమానత్వ, సానుకూల భావన ఏర్పడుతుంది. అయితే మోడల్స్ మాత్రం ఫ్యాషన్(Fashion)లో ఇలాంటి భావనకు భిన్నంగా ఉండాలనుకుంటారు. ఇక్కడ ఇతరులను డామినేట్ చేసేలా తమ బిహేవియర్ ఉండాలని ఆలోచిస్తారు. ఇది ర్యాంప్ వాక్ లేదా ఫ్యాషన్ షో నిర్వహణలో ఒక అంతర్గత నిబంధనగా కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ర్యాంప్‌పై ఉన్నప్పుడు నవ్వడంవల్ల తమ హోదా లేదా స్థానాన్ని ప్రేక్షకులు గుర్తించే అవకాశం తగ్గుతుందని మోడల్స్ భావిస్తారు. తమ నవ్వులు, మాటలు వంటివి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే.. తాము ధరించిన దుస్తులను, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను వారు నిర్లక్ష్యం చేయవచ్చు. దీంతో తాము అనుకున్న మెసేజ్ ప్రేక్షుల్లోకి వెళ్లదు. అదే గాంభీర్యంగా ఉంటే ప్రేక్షకులు మోడల్స్ మొహాలను, వారి మాటలను పట్టించుకోరు. దీంతో వారి హావ భావాలపై, ధరించిన దుస్తులపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి మోడల్స్ ఈ సందర్భంగా నవ్వరని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే నవ్వడం అనేది సానుకూల భావోద్వేగానికి, సీరియస్‌నెస్ అనేది అక్కడున్న పరిస్థితిపై పైచేయి కలిగి ఉన్న భావనకు నిదర్శనంగా భావిస్తారు ఎవరైనా. అందుకే తాము ధరించిన సరికొత్త ఫ్యాషన్ లేదా ట్రెండీ దుస్తులను (Trendy clothes) ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ర్యాంప్‌పై డామినేటెడ్‌గా కనపించాలనుకుంటారట మోడల్స్. అందుకే నవ్వరని స్టోరీపిక్ వెబ్‌సైట్ కథనం కూడా వెల్లడిస్తోంది. నిపుణులు సైతం ఇదే చెప్తున్నారు.