Mrunal Thakur: విజయ్‌తో కలిసి ఉన్న ఫొటో ఎడిట్ చేసిన వ్యక్తి.. ఆగ్రహం వ్యక్తం చేసిన మృణాల్

by Hamsa |   ( Updated:2024-11-02 15:04:37.0  )
Mrunal Thakur: విజయ్‌తో కలిసి ఉన్న ఫొటో ఎడిట్ చేసిన వ్యక్తి.. ఆగ్రహం వ్యక్తం చేసిన మృణాల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇందులో సాంప్రదాయంగా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’(Hi Nanna) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని వరుస ఆఫర్లు అందుకుంది. అయితే ఇటీవల మృణాల్ విజయ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది.

ప్రజెంట్ మృణాల్ పూజా మేరీ జాన్(Pooja Mary John), హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్-2, తుమ్ హీ హో వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ అభిమాని విజయ్‌తో ఉన్న ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) పోస్టర్‌ను ఎడిట్ చేసి మృణాల్ పక్కన తన పిక్ పెట్టి.. టపాసులు కాలుస్తున్నట్లు క్రియేట్ చేశాడు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన మృణాల్(Mrunal Thakur) అదిరిపోయే రిప్లై ఇచ్చింది. అలా ఎడిట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బ్రదర్.. మీకు మీరే ఎందుకు తప్పుడు భరోసా ఇచ్చుకుంటున్నారు. మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారా? ఇది అస్సలు బాలేదు’’ అని రాసుకొచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం మృణాల్‌(Mrunal Thakur)కు సపోర్ట్‌గా కామెంట్లు పెడుతున్నారు.


Read More ..

Samantha: వామ్మో.. దట్టమైన అడవిలో ఆ పని చేస్తున్న సమంత.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్

Advertisement

Next Story