- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RK Roja: తొక్కి నార తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. స్పందించిన మాజీ మంత్రి రోజా
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. శనివారం బాధిత కుటుంబాన్ని వైసీపీ(YCP) నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja) పరామర్శించారు. ఈ సదర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) తొక్కి నార తీస్తానన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని తొక్కి నార తీశారో చెప్పాలని రోజా(RK Roja) డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మత్తుపదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. నాలుగు నెలల్లో వందకుపైగా అఘాయిత్యాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. కాగా, తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను ఆదేశించారు.