కురిసిన వర్షం.. తడిసిన వరి ధాన్యం

by Aamani |
కురిసిన వర్షం.. తడిసిన వరి ధాన్యం
X

దిశ,రాయపర్తి : ఖరీఫ్ లో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకొని మరల యాసంగి పంటలకు కు సిద్ధమవ్వాలని కలలు కంటున్న రైతన్నలకు వరుణదేవుడు తీవ్ర ఆటంకాలను సృష్టిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటివరకు కూడా ఏ ఒక్క గ్రామంలో కాంటాలు పెట్టకపోవడంతో రైతన్నలు వరి ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు అకాల వర్షాలకు ఆరబోసుకొని తేమ శాతం వచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దవడంతో ఆ ధాన్యాన్ని మరల ఎలా ఆరబోయాలని రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. కాంటాలు అయ్యుంటే కల్లాలలో రైతులకు ఇబ్బందులు తప్పేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరగా కాంటాలు మొదలుపెట్టి వరి ధాన్యాన్ని కల్లాల నుండి రైస్ మిల్లులకు తరలించాలని ప్రభుత్వానికి రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story