- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Naredra Modi: తుఫాన్ ఎఫెక్ట్.. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దు
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ బంగాళాఖాతం (South Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈనెల 26 నుంచి 28 వరకు దక్షిణ కోస్తా (South Coast), రాయలసీమ ణ(Rayalaseema)లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు (IMD Officials) హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం నేపథ్యంలో దక్షిణ కోస్తా (South Coast) తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఒకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రా (Coastal Andhra)లో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. కోతలు చేపట్టవద్దని, ఇప్పటికే కోతలు కోస్తే పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈనెల 29న విశాఖపట్నం (Vishakhapatnam)లో పర్యటించాల్సి ఉండగా తుఫాన్ హెచ్చరికలతో నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయినట్లుగా పీఎంవో (PMO) వెల్లడించింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ (NTPC Green Hydrogen Hub)కు శంకుస్థాపన, పలు రైల్వే ప్రాజెక్టులు (Railway Projects), జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, తుఫాన్ హెచ్చరికలతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.