BRS Leader: కొసరు రూ.100 కోట్లు సరే.. అసలు రూ.12,400 కోట్ల సంగతేంటి?

by Gantepaka Srikanth |
BRS Leader: కొసరు రూ.100 కోట్లు సరే.. అసలు రూ.12,400 కోట్ల సంగతేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University)కి అదానీ(Adani) ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని నిరాకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన అదానీకి లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆదానీతో సహా ఏ సంస్థ నుంచీ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిధులు తీసుకోలేదని స్పష్టం చేశారు. స్కిల్‌ యూనివర్సిటీ వివాదాల్లో చిక్కుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్(BRS) నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) స్పందించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘కొసరు వంద కోట్లు ఇస్తున్నవు సరే, కానీ కోహినూర్ హోటల్లో కూర్చుని నాలుగు గంటలు ముచ్చట్లు పెట్టి పంచుకున్న అసలు సంగతేంటి? రూ.12,400 కోట్ల ఒప్పందాల గూడుపుఠాణి ఏందీ?’ అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కెన్యా లాంటి చిన్న దేశం సామాజిక బాధ్యతతో వెంటనే అదానీతో ఒప్పందాలు రద్దు చేస్తే.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) మొట్టికాయ వేసే దాకా, కేటీఆర్(KTR) నిలదీసే దాకా రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed