- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vijay Antony: వివాదాస్పద పోస్ట్‌తో చిక్కుల్లో పడిన హీరో.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఆయన రియాక్షన్ ఏంటంటే?

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏకంగా 26 మంది అమాయకపు పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో యావత్ భారతదేశం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ దాడి పాకిస్తాన్ వాళ్ళు చేసినట్లు భావిస్తూ.. మళ్లీ ఎదురుదాడి చేయాలని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఓ షాకింగ్ పోస్ట్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు అందులో ఏముందంటే.. ‘‘చనిపోయిన వారికి నా సంతాపం తెలుపుతున్నాను. అయితే పాకిస్తాన్‌లో 50 లక్షల మంది భారతీయు గురించి ఆందోళన చెందుతున్నాను. మనలాగా పాకిస్తాన్‌లో ఉన్నవారు కూడా శాంతి, సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు.
కాబట్టి ద్వేషాన్ని వదిలేసి మానవత్వాన్ని చాటుకుందాం’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అక్కడ 50 లక్షల మంచి ఉన్నారని ఎలా తెలుసు సాక్షాలు ఉన్నాయా? అని విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, విజయ్ ఆంటోనీ(Vijay Antony) మరో పోస్ట్ పెట్టాడు. ‘‘నా పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారు. కాశ్మీర్‌లో క్రూరమైన మారణకాండను ఒక భయంకరమైన టెర్రరిస్టుల బృందం చేసింది. దీని ఏకైక లక్ష్యం మన ఐక్యత, బలమైన బంధాన్ని విచ్ఛిన్నం చేయడమే. అయితే భారత ప్రభుత్వం, మనం భారతీయులుగా మన సార్వభౌమాధికారాన్ని బలమైన హస్తంతో కాపాడుకుందాం’’ అని అన్నారు. అయితే విజయ్ ఆంటోని చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ట్రై చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం దారుణంగా మాట్లాడుతూ ట్రోల్ చేయడం ఆపడం లేదు.