- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుక్కుగూడలో అక్రమ నిర్మాణాల జోరు..
దిశ, మహేశ్వరం : తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ, మంఖాల్, రావిరాల, సర్దార్ నగర్, ఇమామ్ గూడ, మహేశ్వరం గేట్ నుంచి ప్రజేయ్ వెళ్లే రహదారి పక్కన అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అక్రమార్కులు మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అడ్డగోలుగా నిర్మాణాలను చేపడుతున్నారు. మరో పక్క అనుమతి కొంత తీసుకొని నిర్మాణం మరింత అన్నట్టు చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు మున్సిపాలిటీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల పై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోకుండా నిద్రమత్తులో మునిగిపోతున్నారన్న విమర్శలున్నాయి.
టౌన్ ప్లానింగ్ అధికారి మౌనమెందుకు..?
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా సెల్లార్లు, బిల్డింగ్‌లు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ శాఖ అధికారులు మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.