RGV : ఆర్జీవీ ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ

by Y. Venkata Narasimha Reddy |
RGV : ఆర్జీవీ ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ(RGV)దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్(Anticipatory bail) పై నేడు ఏపీ హైకోర్టు(High Court)లో విచారణ జరుగనుంది. ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసు బృందాలు ఆర్జీవీ కోసం గాలిస్తున్నాయి. దీంతో ఆర్జీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్‌ వేశారు. ఆర్జీవీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ సార్వత్రిక ఎన్నికలకి ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ అభ్యంతరకర పోస్టులను పోస్ట్ చేశారు. దాంతో టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఇటీవల ఒంగోలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం రాంగోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చి పిలిచారు.

విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించిన రాంగోపాల్ వర్మ.. 4 రోజులు గడువు అడిగారు. తొలుత తనపై ఉన్న కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఆర్జీవీ ఇప్పటికే రెండుసార్లు పోలీసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఏపీ పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో ఆర్జీవీ కోసం గాలిస్తున్నారు. ఈ నెల 23న కోయంబత్తూరు లో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో వర్మ దిగిన ఫొటోలు ఎక్స్ లో పోస్ట్ అవ్వడంతో ఓ బృందం కోయంబత్తూరు, మరో బృందం ముంబాయికి వెళ్లింది. ఆర్జీవీ లీగల్ టీమ్ మాత్రం వర్మ వర్చువల్ గా విచారణకు హాజరవుతారని చెప్పినప్పటికి ఏపీ పోలీసులు అరెస్టు కోసం పట్టుబట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed