Spicy foods: స్పైసీ ఫుడ్స్ తింటే ముక్కు నుంచి నీరు ఎందుకు కారుతుంది.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?

by Anjali |   ( Updated:2024-11-26 09:14:16.0  )
Spicy foods: స్పైసీ ఫుడ్స్ తింటే ముక్కు నుంచి నీరు ఎందుకు కారుతుంది.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది తీపి పదార్థాలు ఇష్టపడితే.. మరికొంతమంది స్పైసీ ఫుడ్స్‌(Spicy foods)ను లైక్ చేస్తారు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాలైతే(బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్) కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. తినాలనిపిస్తుంది కూడా. అయితే స్పైసీ తినేటప్పుడు సాధారణంగా ముక్కు నుంచి నీరు కారడం గమనించే ఉంటారు.

ముక్కు నుంచి నీరు ఎందుకు కారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. వైద్యపరంగా చూసినట్లైతే.. స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు ముక్కు నుంచి నీరు కారడాన్ని రినోరియా అని అంటారు. ఇది ఒక అలెర్జిక్(Allergic) ప్రతిస్పందన. ఫుడ్ అలర్జీల కారణంగా ముక్కు నుంచి వాటర్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే మిరపకాయ(Chilli) తిన్నప్పుడు నీరు కారడానికి మరో కారణం దాగుంది. మిరపలో క్యాప్సేసిన్(Capsaicin) అనే రసాయనం(chemical) ఉంటుంది. కాగా ఇది శారీరక కణజాలంతో కలిసినప్పుడు మంటగా ఉంటుంది. కాగా ముక్కు నుంచి నీరు కారుతుంది. కారం ఉన్న ఉత్పత్తుల్లో ఓన్లీ క్యాప్సైపి(Capsaipi)నే కాదు.. అనేక సమ్మేళనాలు(Compounds) ఉంటాయి.

ఈ కారం నిండిన ఉత్పత్తులు శరీర రంధ్రాలను(Body pores), లంగ్స్(Lungs) ను, క్యావిటీల(cavities)ను కాపాడే పలుచని పొరలను చికాకు పెడుతూ ఉంటాయి. చికాకుగా ఉన్నప్పుడు మంట అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ముక్కు కారడంతో పాటుగా దిబ్బడ కట్టినట్లు, తుమ్ములు రావడం(Sneezing), గొంతులో శ్లేష్మం(Mucus throat) వస్తున్నట్లు, దగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్పైసీ ఫుడ్స్(Spicy foods) తినేటప్పుడు ముక్కు కారడాన్ని అలెర్జీ రినిటిస్ అంటారు. పలు రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు వెంటనే సంకేతాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలంటున్నారు నిపుణులు.

విపరీతంగా దగ్గు(cough) రావడం, శ్వాస ఆడక పోవడం(shortness of breath), ముక్కు దిబ్బడ కట్టినట్టు అవ్వడం, చర్మం మీద దురద, దద్దుర్లు(hives) వంటివి రావడం, శరీరంలో కూడా వాపు రావడం(Swelling), గొంతు బిగించినట్టు అనిపించడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం వంటి లక్షణాలు అలర్జీకి కారణాలే అంటున్నారు నిపుణులు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story