Toxic: ఈ సినిమా కోసం మేము ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాము.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
Toxic: ఈ సినిమా కోసం మేము ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాము.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరో యశ్(Yash), గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘టాక్సిక్’ (Toxic). దీనిని కేవీఎన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్(Monster Mind Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక బుధవారం యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ సినిమా నుంచి బర్త్‌డే పీక్ పేరుతో గ్లింప్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అందులో ఆయన రెట్రో కారులోనుంచి స్టైలీష్‌గా సిగార్ కాలుస్తూ ఓ క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఈ నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘ఇది రొటీన్‌కు భిన్నంగా రూపొందిస్తున్న సినిమా. దీనికోసం మేము ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాము. ఇది కేవలం వెండి తెరపై చూసి ఆస్వాదించే సినిమా. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ వైవిధ్యమైన అనుభవాన్ని అందిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story