- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Summer tour: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ ప్రాంతాలకు వెళ్లండి!

దిశ, వెబ్ డెస్క్: సమ్మర్ (Summer) సీజన్ వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో విద్యార్థులకు సెలవులు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి టూర్లు (Tour) వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రాంతాలకు వెళ్లాలని, ప్రకృతితో గడపాలని అనుకుంటారు. ఇక మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయలే (Himalayas). ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో ఏ ఏ ప్రాంతాలు సమ్మర్ వెకేషన్స్‌కి బెస్ట్ ప్లేసెస్సో ఇక్కడ తెలుసుకుందాం.
వేసవిని ఎంజాయ్ చేయాలని అనుకునే వారు లేహ్- లడఖ్‌కి తప్పనిసరిగా వెళ్లండి. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి అందాలు, మఠాలు, స్వచ్ఛమైన సరస్సులు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రికులు, సాహస యాత్రికులను లేహ్- లడఖ్ ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాగే, ఇండియాలోని బెస్ట్ హిల్ స్టేషన్ శిమ్లా కూడా వేసవి విడిదికి అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించడం, సుందర దృశ్యాలు చూడటం, షాపింగ్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి.
జమ్మూ కశ్మీర్ టూర్ వెళ్లాలనుకునే వారు మనాలిని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ దట్టమైన హిమాలయ పర్వతాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ఇది కేరాఫ్ అడ్రస్. బియాస్ నది పరవళ్లు, నదీ ఒడ్డున ప్రశాంతమైన పర్వతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఖజ్జియర్‌ను భారతదేశపు స్విట్జర్లాండ్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ ఆకుపచ్చని పచ్చికబయళ్లు, మంచుతో కప్పబడిన పర్వతాలు స్విట్జర్లాండ్‌ని తలపిస్తుంటాయి.