L2- EMPURAAN: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

by sudharani |   ( Updated:2025-03-20 11:47:23.0  )
L2- EMPURAAN: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా: మలయాళ మెగా స్టార్ మోహ‌న్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఎల్-2: ఎంపురాన్’ (L2- EMPURAAN). బ్లాక్ బ‌స్టర్ చిత్రం లుసిఫ‌ర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 27న మలయాళం(Malayalam)తో పాటు తమిళం(Tamil), తెలుగు(Telugu), కన్నడ(Kannada), హిందీ(Hindi) భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్(Trailer) అప్‌డేట్ ఇచ్చాడు మోహన్ లాల్.

‘‘ఎల్-2: ఎంపురాన్’ ట్రైలర్ 1:08 PM 20/03/25 న మలయాళం, తమిళం, హిందీ, తెలుగు, కన్నడలో రాబోతుంది. చూస్తూ ఉండండి!’ అని అఫీషియల్ అనౌన్స్‌మెంట్(Official Announcement) ఇస్తూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌(Powerful poster)ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మోహన్ లాల్ సీరియస్‌గా చూసుకుంటూ మెట్లపై నుంచి వస్తుండగా.. చుట్టూ మంటలు వ్యాపించి ఉన్నాయి. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. మోహన్ లాల్ లుక్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, అభిమన్యు సింగ్, జెరోమ్ ఫ్లిన్, ఎరిన్ ఎబౌనీ అండ్ సూరజ్ వెంజరమూడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story

Most Viewed