KTR: కేటీఆర్ సంచలన ప్రకటన.. ఇక మేము చూసుకుంటామని వారికి భరోసా

by Gantepaka Srikanth |
KTR: కేటీఆర్ సంచలన ప్రకటన.. ఇక మేము చూసుకుంటామని వారికి భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: గురుకుల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలు, గురుకులాల పరిస్థితిపై కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష కూడా చేయట్లేదని అన్నారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయం.. ఆ కుటుంబాల తరపున శాసన సభలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని సంచలన ప్రకటన చేశారు.

కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ధైర్యంగా ఉండండి అని కోరారు. ఆరోగ్యం బాగాలేకపోతే తాము ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పిస్తాం. బీఆర్ఎస్‌ను సంప్రదించండి అని సూచించారు. రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్‌లో ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందని అన్నారు. రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత ఎక్కడేం చేయలేక.. తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడని ఎద్దేవా చేశారు. నిన్న ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టినాయుడును చిప్ దొబ్బినట్లు అనిపించిందని సెటైర్ వేశారు.

ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అబద్ధాలను మీడియా మిత్రులు ప్రశ్నించాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదానీని గజదొంగ అంటివి. మహారాష్ట్రలో గజదొంగ ఇక్కడ సుద్దపూస అయ్యిండా? అని ప్రశ్నించారు. ఆయన చెక్ ఇవ్వలేదు. అది క్యాష్ కాలేదు. ఏదో తమాషా చేసిండని ఆరోపించారు. యాదాద్రి జిల్లా రామన్న పేటలో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రజలు వద్దన్నప్పటికీ పెడుతూ మూసీని కలుషితం చేస్తారట.. మళ్లీ కొడంగల్‌లో కూడా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతారట అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇంటి పేరును ఎనుముల కాదు.. అబద్దాలు రేవంత్ అని మార్చుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed