Donations: విరాళాల్లో గులాబీ పార్టీ టాప్.. ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్

by Shiva |
Donations: విరాళాల్లో గులాబీ పార్టీ టాప్.. ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/నేషనల్ బ్యూరో: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. రిచ్చెస్ట్ పార్టీ.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీగా జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ విరాళాలు అందినట్లుగా ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన జాబితాలో వెల్లడైంది. 2023–24లో బీజేపీకి రూ.2244 కోట్లు రాగా, బీఆర్ఎస్రూ.580 కోట్లు, కాంగ్రెస్కు రూ.289 కోట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014–15 నుంచి 2023-24 వరకు రూ.1746 కోట్లు విరాళాలు వచ్చాయి. ఒక నాడు పార్టీకి కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని దశ నుంచి దేశంలోనే అత్యంత ధనవంత పార్టీగా నిలిచింది. పార్టీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలోనే ఘనత సాధించింది. పదేళ్ల కాలంలో 2023–24, 2022–23, 2021–22, 2018–19 నాలుగేండ్లలో అత్యధికంగా రూ.1638కోట్ల విరాళాలు అందాయి. ఎన్నికల సంఘం తీసుకవచ్చిన ఎలక్షన్ బాండ్స్ తో రహస్యంగా వారి వివరాలు తెలియకుండా విరాళాలు ఇవ్వొచ్చనే నిబంధన తీసుకరావడంతో అత్యధికులు రహస్యంగా బాండ్ల ద్వారా వివరాలు అందించాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విరాళాలు ఇచ్చిన కంపెనీల వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో కాంట్రాక్టులు దక్కిన సంస్థలు అనేకం బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన జాబితాల్లో ఉన్నాయి.

వరంగల్ టెక్స్ టైల్ కంపెనీలో పెట్టుబడిన పెట్టిన కేరళకు చెందిన కంపెనీ బీఆర్ఎస్కు విరాళం అందించింది. అనేక ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, నిర్మాణ సంస్థలు ఇలా అనేక సంస్థలు బీఆర్ఎస్కు విరాళాలు అందించాయి. పార్టీకి విరాళాలు అందించి ప్రభుత్వ పరంగా పరోక్షంగా లబ్ధి పొందాయని, ఆయా సంస్థల జాబితాలను చూస్తే అవగతమవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి విరాళాల వివరాలను పరిశీలిస్తే కరోనా తరువాతే అత్యధికంగా విరాళాలు అందాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న చివరి మూడేళ్లలో అత్యధికంగా విరాళాలు అందాయి. బీఆర్ఎస్ ఆర్థిక పరిస్థితి గురించి అనేక మంది నాయకులు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అంతటి దీన స్థితి నుంచి దేశంలోనే అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్వాది పార్టీ, దేశంలోనే పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వెస్ట్బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ కంటే కూడా బీఆర్ఎస్కు ఎక్కువ విరాళాలు అందాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్టీకి కార్యాలయాలు, హైదరాబాద్లో మరో 11 ఎకరాల్లో నూతన కార్యాలయం, ఢిల్లీలో కార్యాలయం ఇవన్నీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మించారు.

2023–24 సంవత్సరంలో విరాళాలు స్వీకరించిన పార్టీల వివరాలు

–––––––––––––––––––––––––––––––

పార్టీ విరాళం మొత్తం (రూ.కోట్లలో)

–––––––––––––––––––––––––––––––

బీజేపీ - రూ.2244 కోట్లు

బీఆర్ఎస్ - రూ.580 కోట్లు

కాంగ్రెస్ - రూ.289 కోట్లు

వైఎస్ఆర్సీపీ - రూ.184 కోట్లు

టీడీపీ - రూ.100 కోట్లు

డీఎంకే - రూ.60 కోట్లు

ఆప్ - రూ.11 కోట్లు

టీఎంసీ - రూ.06 కోట్లు

–––––––––––––––––––––––––––––

బీఆర్ఎస్ పార్టీకి గత పదేళ్లలో అందిన విరాళాల వివరాలు..

–––––––––––––––––––––––--------

సంవత్సరం అందిన విరాళాలు

–––––––––––––––––––––-

2023-24 రూ.580.00 కోట్లు

2022-23 రూ.683.06 కోట్లు

2021-22 రూ.193.90 కోట్లు

2020-21 రూ.4.15 కోట్లు

2019-20 రూ.89.55 కోట్లు

2018–19 రూ.182.77 కోట్లు

2017–18 రూ. 3.31 కోట్లు

2016-17 రూ.0.34 కోట్లు

2015–16 రూ. 0.76 కోట్లు

2014–15 రూ.8.69 కోట్లు

–––––––––––––––––––––––

మొత్తం - రూ.1746.53 కోట్లు

–––––––––––––––––––––––

Advertisement

Next Story