అంగన్వాడి, పంచాయతీ భవన నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరు..

by Sumithra |
అంగన్వాడి, పంచాయతీ భవన నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరు..
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రెవెన్యూ డివిజన్లోని 5 మండలాల్లో 12 అంగన్వాడి కేంద్రాలు, 8 గ్రామపంచాయతీ నూతన భవనాలకు 3 కోట్ల 10 లక్షలు మంజూరు చేయించినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, మల్హర్ రావు, పలిమెల మండలాల్లో 12 అంగన్వాడి కేంద్రాలను, 8 గ్రామపంచాయతీల్లో నూతన భవనాలను నిర్మించేందుకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేర కలెక్టర్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

కాటారం మండలంలోని అంగన్వాడి భవనాలు..

చిద్నేపల్లి, లక్ష్మీపూర్ (దామెర కుంట), దేవరాంపల్లి (రేగుల గూడెం), గుండ్రాత్ పల్లి, కాటారం మండలంలోని నూతన గ్రామపంచాయతీ భవనాలు శంకరంపల్లి, ధర్మసాగర్, రేగుల గూడెం, అంకుసాపూర్ గ్రామాల్లో మంజూరయ్యాయి.

మహాముత్తారం మండలంలోని గండి కామారం-2, పోలారం శ్రీపాద కాలనీ (కొర్లకుంట), మహాదేవపూర్ మండలంలో సూరారం -1, బెగ్లూర్-1, బ్రాహ్మణపల్లి-2 లో అంగన్వాడి భవనాలకు నిధులు మంజూరయ్యాయి.

మహాదేవపూర్ మండలంలోని నూతన గ్రామపంచాయతీ భవనాలు బెగ్లూర్, సూరారం, మల్హర్ రావు మండలంలోని నూతన అంగన్వాడి భవనాలు పెద్ద తుండ్ల -1, రుద్రారం -1 గ్రామపంచాయతీ భవనం రుద్రారంకు మంజూరయ్యాయి. పలిమెల మండలంలోని దమ్మూరులో గ్రామపంచాయతీ భవనానికి నిధులు మంజూరయ్యాయి. 1) కాటారం సీసీ డ్రైన్ శ్రీపాద కాలనీ -10 లక్షలు, 2) సీసీ రోడ్డు వివేకనంద స్కూలు నుండి అయ్యప్ప టెంపుల్ వరకు - 5 లక్షలు, 3) సీసీ రోడ్డు శ్రీ హర్షిత డిగ్రీ కాలేజ్ నుండి ఓల్డ్ సినిమా టాకీస్ వరకు - 5 లక్షలు, సీసీ రోడ్డు ఉదయ్ ఇంటి నుండి అయ్యప్ప టెంపుల్ వరకు - 5 లక్షలు, 5) సీసీ రోడ్డు బాజీ ఇంటి నుండి ఎండి బాబర్ ఇంటి వరకు - 5 లక్షలు, 6) సీసీ రోడ్డు బజార్ ఓదెలు ఇంటి నుండి ఇప్పల గూడెం రూట్ వరకు - 4 లక్షలు, 7) సీసీ రోడ్డు పర్లపల్లి నారాయణ ఇంటి నుండి మార్కెట్ రోడ్డు వరకు -8 లక్షలు, 8) సీసీ రోడ్డు ఖమ్మం రాజయ్య ఇంటి నుండి పెనుగొండ సురేష్ ఇంటి వరకు -4 లక్షలు 9) సీసీ డ్రైన్ తయూబ్ ఇంటి నుండి మార్కెట్ రోడ్ వరకు - 8 లక్షలు, అంగన్వాడి కేంద్రానికి రూ 8 లక్షలతో నిర్మించనున్నారు. మండలాలలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు మంత్రి శ్రీధర్ బాబుకు, జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story