BJP : రాష్ట్రపతిని అవమానించిన రాహుల్ గాంధీ! బీజేపీ ఆరోపణలు.. వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:2024-11-26 13:08:52.0  )
BJP : రాష్ట్రపతిని అవమానించిన రాహుల్ గాంధీ! బీజేపీ ఆరోపణలు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 75వ రాజ్యాంగ దినోత్సవ (Constitution Day) కార్యక్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Droupadi Murmu) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవాళ పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలుపుతారు. అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పలేదని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malviya) విమర్శించారు.

రాష్ట్రపతిని కూడా పలకరించనంత అహంకారంతో (Rahul Gandhi) రాహుల్ గాంధీ వ్యవహరించాడని విమర్శించారు. ఎందుకంటే ఆమె గిరిజన సంఘం నుంచి వచ్చినందున అని ఆరోపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ యువరాజు? వాట్ ఏ చీప్ మెంటాలిటీ? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ వీడియోలను పోస్ట్ చేసింది. ‘దేశ ప్రథమ పౌరురాలు, ఆదివాసీ ఆడపడుచు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి గిరిజన సమాజం పట్ల గౌరవం లేదు, గౌరవ రాష్ట్రపతి పదవి అన్నా మర్యాద లేదు’ అని ఎక్స్ వేదికగా తెలంగాణ బీజేపీ ఆరోపణలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed