రూ.13.40 కోట్లతో అభివృద్ధి పనులు

by Sridhar Babu |
రూ.13.40 కోట్లతో అభివృద్ధి పనులు
X

దిశ, చందుర్తి : రూ.13.40 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో రూ.80 లక్షలతో R&B రోడ్డు నుండి హైస్కూల్ మధ్యలో హై లెవల్ బిడ్జి నిర్మాణానికి, సనుగుల గ్రామంలో కోటి రూపాయలతో సనుగుల నుండి మాకుల ఎల్లమ్మ గుడి వయా గంగిరెద్దుల కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం మర్రిగడ్డ గ్రామంలో ఫాల్ట్రీ ఫారానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో నేడు సనుగుల గ్రామంలో భూమి పూజ నిర్వహించుకున్నామని అన్నారు. గతంలో సనుగుల గ్రామంలో రోడ్డు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఎన్నికల సమయంలో గంగిరెద్దుల కాలనీ వారు తనకు ఏకగ్రీవంగా మద్దుతు తెలిపారని గుర్తు చేశారు.

వారికి ఆ సమయంలో రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చానని, వాటిని అమలు చేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో రూ.13.40 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఎర్ర చెరువు, పటేల్ చెరువుకు కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తాం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story