గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

by Sridhar Babu |
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
X

దిశ, ఉట్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ, అదే విధంగా బోయవాడ కాలనీలో నూతన అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

భారత రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని రాజ్యాంగ పీఠికను చదువుతూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed