- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చేసిన దీక్షకు గుర్తుగా దీక్షా దివస్ : బాల్కొండ ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేయడంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్ష దివస్ కోసం సన్నాహక సమావేశం మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే అని ఆనాడు టీడీపీలోతనకున్న పదవులన్నింటిని వదిలేసి బీఆర్ఎస్ ను స్థాపించారని ఆయనన్నారు. 2001 లో వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రాష్ట్ర చరిత్రలో పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే జిల్లా పరిషత్ కైవసం చేసుకున్న పార్టీగా టీఆర్ఎస్ గుర్తింపు పొందిందన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని ఆనాడు కేసీఆర్ తెగేసి చెప్పారని అన్నారు.
కేసీఆర్ చేపట్టిన రాష్ట్ర సాధన ఉద్యమం,ప్రజల్లో ఉన్న రాష్ట్ర కాంక్షను గమనించిన కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తో తో పొత్తు పెట్టుకుందన్నారు. 2004 లో తీరా పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ , సోనియాగాంధీ 2009 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆనాడు ప్రభుత్వంలో చేరిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు డిమాండ్ తో అటు కేంద్ర మంత్రి పదవులను, ఇక్కడ రాష్ట్రంలో మంత్రి పదవులను కూడా వదిలేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట మార్చి తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ నవంబర్ 29, 2009 లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారన్నారు. కరీంనగర్ నుండి దీక్ష చేయడానికి సిద్దిపేటకు బయలుదేరిన కేసీఆర్ ను అలుగునూరు వద్ద అరెస్ట్ చేసి ఖమ్మం అక్కడి నుండి నిమ్స్ కు తరలించారు.
హాస్పిటల్ లోనే 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు.కేసీఆర్ దీక్షతో యూనివర్సిటీ విద్యార్థి లోకం, మేధావులు,ఉద్యోగులు తెలంగాణ సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయని, కేసీఆర్ దీక్షా ఫలితంగానే డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ఏర్పాటులో జరిగిన పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ నెల 29 న దీక్షా దివస్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఆదేశించిందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 500 పై చిలుకు కార్యకర్తలు ఆ రోజు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదని, కనుమరుగైపోతుందని ఆవాకులు చెవాకులు పేలుతూ ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని ప్రశాంత్ రెడ్డి మండి పడ్డారు. ఫైరవీకారులు, కాంట్రాక్టులు చేసుకునే వారు పార్టీ మారితే మాకు పెద్దగా నష్టమేమీ లేదని ఆయనన్నారు.
ప్రజా సమస్యలపై సైనికుల్లా పోరాడే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజల పక్షాన పోరాడుతారన్నారు. వారే కాంగ్రెస్ పార్టీ భరతం పడుతారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇంతలా ప్రజల చేత తిట్టించుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి తప్పమరొకరు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో పూర్తిగా నమ్మకం కోల్పోయారని ఆయనన్నారు. సన్నాహక సమావేశంలో జిల్లా కార్యక్రమ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్,జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.