- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Supreme court: ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలి.. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ (Ballot paper) ఓటింగ్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme court) తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ విధానం కుదరదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్ చేపట్టాలని కోరుతూ కేఏ పాల్ (Ka paul) అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్ (Vikramnath), జస్టిస్ పీబీ వరాలే (PB varale)లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పార్టీలకు ఈవీఎం (EVM)తో సమస్య లేదు, మీ వద్ద ఎందుకు ఉంది? మీకు అలాంటి బ్రిలియంట్ ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తాయి? అని పిటిషనర్‌ని ప్రశ్నించింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని పలువురు నేతలు అంటున్నారని, గెలిచినప్పుడు ఏమీ మాట్లాడటం లేదని తెలిపింది. కాబట్టి ఈ అంశాన్ని ఎలా చూడగలమని పేర్కొంది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నామని, వీటన్నింటిపై చర్చకు ఇది వేదిక కాదని స్పష్టం చేసింది.
3 లక్షలకు పైగా అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు పిటిషనర్ అధ్యక్షుడని గ్రహించిన న్యాయస్థానం.. మీ పని చాలా భిన్నంగా ఉందని, ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించింది. అంతకుముందు కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను సులభంగా ట్యాంపర్ చేయొచ్చని, కాబట్టి ఈవీఎంలకు బదులుగా బదులుగా పేపర్ బ్యాలెట్లను ఉపయోగించే అమెరికా వంటి దేశాల పద్ధతులను భారత్ అనుసరించాలని సూచించారు. ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని, ఎలన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వంటి నేతలు కూడా ఈవీఎంలపై ప్రశ్నలు సంధించారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించి పై వ్యాఖ్యలు చేసింది.